Group: Windows 7 Sins/Translations/Telugu/Press

From LibrePlanet
Jump to: navigation, search

విండోస్ 7 పాపాలు ప్రచారం 8 భాషల అనువాదనంతరం అంతర్జాతియ అనువాద సదస్సుని ఏర్పాటు చేస్తుంది.

బోస్టన్, మస్చుసెట్ట్స్, యు.ఎస్.ఏ-మంగళవారం 15, 2009: ది యఫ్.ఎస్.యఫ్ (ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్) కంప్యూటర్ వినియోగదారుల స్వేచ్ఛ ధృష్ట్యా , విండోస్ 7 పాపాలు అనే ప్రచారాన్ని, ఎనిమిది భాషలలో అనువాదించి ఇంకా మరెన్నో భాషల అనువాద క్రమాన్ని ప్రారంభిస్తూ ప్రకటించారు.

విండోస్ 7 పాపాలు అనే ప్రచారం ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ యొక్క 7 ముఖ్యమైన లోపాలను ఎత్తి చూపి వాటిని 7 పాపాలుగా పరిగణించటం గమనర్హ్యం.ఇవి విండోస్ 7 లో ఉండడం చర్చకు కేంధ్రీకృతమైన అంశం. ప్రైవసీని అధిగమించటం, విద్యను విషప్రదం చేయటం, వినియోగదారుణి పై ఆంక్షలు విధించటం, అనైతికి పనికిరాని విలువలు, జట్టిబేరపు ప్రవర్తన, డి.ఆర్.యమ్ పై వొత్తిడి, వినియోగదారుడి భద్రతపై బెదిరింపు.

పైన పేర్కొన్న అంశాలన్నీ పార్చ్యూన్ 500 కంపెనీలకు, ఒక ఉత్తరం రూపకంలో ఇ-మెఇల్ చేయడం జరిగింది.అదేవిధంగ ఎన్.జీ.ఓ లకు కూడా పంపడం జరిగింది. విండోస్ 7 నిర్ణయత్మకులని ఈవిధంగా హెచ్చరిస్తుంది:"ప్రైవసీ లేకపోవటం, అదే విధంగా, స్వేచ్ఛ మరియు భద్రత లేకపోవడం కూడ ఈ ఉత్తరంలో గమనించదగ్గ విషయాలు.వీటిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నయాలుగా, గ్నూ లైనక్స్, ఓపెన్ ఆఫీస్ వాడడం పై సూచించింది.

బాధ్యత గల పౌరులందరినీ పై ఉత్తరాన్ని వివిధ విండోస్ 7 నిర్ణయాత్మకులకు చేరవేయవల్సిందిగా యఫ్.యస్.యఫ్ కోరుతుంది.యఫ్.యస్.యఫ్ ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్ పీటర్ బ్రౌన్ ఇలా అన్నారు, "చాలామంది వివిధ ఎన్.జీ.ఓలతో, సంస్థలతో సంభాషించినప్పుడు, ప్రొప్రైటరీ సాఫ్టవేర్ ను వాడే వారి వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.మన జాతీయ, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్.జీ.ఓలు, పాఠశాలలు, యూనివర్సిటీలు ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ వాడుకపై వారి యుక్తి బాగలేదు. ఇది వారికి గల అవగాహనా లోపం కూడా కారణం.ఈ నిర్ణయాత్మకులు ఫ్రీ సాఫ్ట్వేర్ ని వాడవలసిన సిద్దాంతాలు అమలుపరుచుకోవాలను ఆశిస్తున్నాను."

"విండోస్ 7 పాపాలను" వివిధ భాషల్లోకి అనువాదించి, ప్రపంచంలోకెల్లా ఉన్న కంప్యూటర్ వినియోగదారుల స్వేచ్ఛ ధృష్ట్యా దీనిని చేపట్టడం జరిగింది." అని మాట్ లీ,క్యాంపైన్ మేనేజర్ అన్నారు.వెబ్ సైట్ అనువాదమే కాకుండా, ఈ ప్రెస్ మీట్ ను వివిధ భాషల్లో కూడా అనువాదించి, ఆ ప్రాంతాలలో స్థానిక ప్రతినిధులను ఏర్పర్చడం జరిగింది.

ఈ అనువాద ప్రక్రియకు అన్నీ ఫ్రీ సాఫ్ట్వేర్ లనే వాడి, గ్నూ మైల్ అనే సాఫ్త్వేర్ వాడి అందరి మధ్య అనుసంధానం ఏర్పర్చడం జరిగింది. మొదట ఫ్రెంచి భాషలో అనువాదం జరగడం వారిని అభినందించదగ్గ అంశం. వారు ఏప్రిల్ లో పూర్తి చేశారు.

ఆసక్తిగల వారు http://meta.windows7sins.org/ సందర్శించి అనువాదానికి ముందుకు రావచ్చు. ఇంగ్లిష్, అరబిక్, ఫ్రెంచి, ఇటాలియన్, రష్యన్, స్పానిష్ , జెర్మన్ మరియు తెలుగులో ఇప్పటివరికే లభ్యం లో ఉన్నయి.

"ఇంగ్లిష్ వాడని ప్రజలకు, వారి భాషలో అనువాదం ఈ ప్రచారం యొక్క ఆవశ్యకతను తెలుపుతాయి. తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ, వారి బంధువులకు, స్నేహితులకు ఈప్రచారాన్ని అందరికీ పంపిణీచేయవలసిందిగా "స్వేచ్ఛ" కోరుతోంది. ఈ అనువాదం స్వేచ్ఛ సభ్యుడైన హరికృష్ణ చేత జరిగింది.ఇలాంటివి అన్నీ తెలుగు ప్రజలకు చేరవేయుటకు మేము సిద్దంగా ఉన్నాం" అని మేధాంశ్ స్వేచ్ఛ క్యాంపైన్ మేనేజర్ అన్నారు.అనువాద ప్రక్రియలో ఆసక్తి గలవారు వారిని సంప్రదించవలసొందిగా కోరారు.

ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ గురించి: 1985లో కంప్యూటర్ వినియోగదారుడి స్వేచ్ఛ ధృష్ట్యా, ఒక్ సాఫ్ట్వేర్ ను ఏ విధంగానైనా వాడుకుని, దాని సోర్స్ కోడ్ చూసి, మార్పులు చేకూర్చి, ఇతరులకు పంపిణీ చేయగల స్వేచ్ఛను అందించేందుకు యఫ్.యస్.యఫ్. ప్రారంభం అయింది. ఈ సంస్థ వివిధ రకాలైన ఫ్రీ సాఫ్ట్వేర్ లను తయారుచేయడంలో తోడ్పడ్తుంది. ముఖ్యంగా గ్నూ అనే ఆపరేటింగ్ సిస్టం ని తయారుచేసి విండోస్ కి ధీఠుగా అందిస్తుంది. దీనిని ఇంటర్నెట్ నుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. http://fsf.org, http://gnu.orgని సందర్శించి ఇతర సమాచారాన్ని తెలుసుకోవచ్చు.దీని అభివృద్దికై దాతలు విరాళాలను కూడా అభినందిచడం జరుగుతుంది. http://donate.fsf.org

ఫ్రీ సాఫ్ట్వేర్ మరియు ఓపెన్ సోర్సు సాఫ్ట్వేర్ ఫ్రీ సాఫ్ట్వేర్ వ్యక్తి స్వేచ్ఛకు కేంద్రీకరించి పాటుపడుతుంటే, ఓపెన్ సోర్సు సాఫ్ట్వేర్ కేవలం టెక్నికల్ గ ఉన్న లాభాలను పొందడం పైనే కేంద్రీకరిస్తుంది.ఫ్రీ సాఫ్ట్వేర్ నైతిక విలువలు, స్వేచ్ఛ అంశం పై కేంద్రీకరించి పనిచేస్తుంది.ఐతే ఓపెన్ సోర్సు ఇలాకాదు. ఈ రెండింటిలో గల తేడాలకు దీనిని సంప్రదించండి. http://www.gnu.org/philosophy/open-source-misses-the-point.html